మునిగుడలో అండర్ గ్రౌండ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
రాయగడ: జిల్లాలోని మునిగుడలో గల టినికొనియా కూడలిలో రైల్వే క్రాసింగ్ వద్ద అండర్ గ్రౌండ్ ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నవంబరు 11న మునిగుడలో గల ప్రగతి మంచ్ ఆధ్వర్యంలో అండర్‌గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రైల్వే శాఖ ఈ మేరకు అండర్‌గ్రౌండ్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రగతి మంచ్ అధ్యక్షుడు సీహెచ్ గణేశ్వరరావు, సింహాచల్ పండా తెలియజేశారు. సంబల్‌పూర్ రైల్వే డివిజన్ పరిఽధిలోకి వస్తున్న మునిగుడలొ అండర్ గ్రౌండ్ ఏర్పాటుకు సంబంధించి రైల్వే డివిజన్ ఏఈ ఎన్ డి రవి, ఐఓడబ్ల్యూ రామారావులు గురువారం మునిగుడలో పర్యటించి అండర్‌గ్రౌండ్ నిర్మాణానికి సంబంధించి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment