భువనేశ్వర్: జాతీయ విద్యా విధానం – 2020 (ఎన్‌ఈపీ–2020) ప్రకారం రాష్ట్ర పాఠ్య ప్రణాళిక రూపకల్పన (ఎస్సీఎఫ్) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం 16 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. భోపాల్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ) మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నిత్యానంద ప్రధాన్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ రాష్ట్ర పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జాతీయ పాఠ్య ప్రణాళిక మార్గదర్శకాల పరిధిలో స్థానిక ప్రాధాన్యత అనుగుణంగా జాతీయ విద్యా విధానం, 2020 (ఎన్‌ఈపీ–2020) అమలు కోసం రాష్ట్ర పాఠ్య ప్రణాళికల రూపకల్పన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ప్రత్యేక కార్యాచరణ. ప్రొఫెసర్ నిత్యానంద ప్రధాన్ అధ్యక్షతన
పాఠశాల, సామూహిక విద్యా శాఖ అదనపు కార్యదర్శి కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎన్‌ఈపీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి సంప్రదింపులు, మొబైల్ యాప్ సర్వేలు, ఇతరేతర ప్రత్యేక ప్రక్రియ ద్వారా రాష్ట్ర పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేస్తారు. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం బుధవారం రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలును అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment