ఘనంగా కనుమ, ముక్కనుమ సంబరాలు
పర్లాకిమిడి:
పట్టణంలో సంక్రాంతి, కనుమ, ముక్కనుమ సంబరాలు మిన్నంటాయి. పలు కూడళ్లలో మహిళలు రంగవల్లుల పోటీలు, సవర్ల నృత్యం, జంగమయ్యలు ఇంటింటికి వెళ్లి గంటలు వాయించడం వంటి విశేషాలతో పండగ ఘనంగా జరుపుకున్నారు. అల్తి గ్రామం నుంచి వచ్చిన ఆదివాసీలు సంప్రదాయకంగా నృత్యం చేస్తున్న సవర జాతి వారికి కోమటి వీధిలో ప్లాస్టిక్ బాల్టీలు, డబ్బులు పంపిణీ చేయడం విశేషం. ఇక గుసాని సమితిలో కనుమ నాడు జరిగే సీత కొడ జాతరకు చుట్టుపక్కల నుంచి యాత్రికులు పోటెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment