అలరించిన గాన లహరి
జయపురం: కొరాపుటియ కళాకార మంచ్ వారు నిర్వహిస్తున్న ఫుష్‌పుణి మహోత్సవ వేదికపై బుధవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో సుప్రసిద్ధ గాయకులు అశీమా మృధుమదురంగా పాడిన పాటలు అశేష శ్రోతలను మైమరపించాయి. అనంతరం కొరాపుట్ జిల్లా ఆదివాసీ నృత్య సంగీతాలు కార్యక్రమంలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అంజళీ దత్, పరేష్ శతపతి, ప్రియదర్శినిల సంగీతం శ్రోతలను మైమరపించింది. కార్యక్రమంలో సబ్‌డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, తహసీల్దార్ సవ్యసాచి జెన, సెంట్ జేవియర్స్ డైరెక్టర్ డాక్టర్ ఎస్జీ శ్రీనివాస పట్నాయిక్, జిల్లా సాంస్కృతిక విభాగ అధికారి ప్రీతి సుధ జెన, జిల్లా టూరిస్టు విభాగ అధికారి తొలిన ప్రధాని అతిథులుగా పాల్గొన్నారు. ఫుష్ పుణి మహోత్సవ కమిటీ అధ్యక్షుడు మనోజ్ పాత్రో, కార్యదర్శి ధీరెన్ మోహన్ పట్నాయిక్,సభ్యులు జయంతి పట్నాయిక్,జయంత దాస్,శ్రీకాంత దాస్ ప్రితూష పట్నాయిక్ తదితరులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment