హైవేపై ఏనుగుల అలజడి
భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా 53వ నంబర్ జాతీయ రహదారిపై ఏనుగులు గుంపు అలజడి రేపింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమీప మలాపురా గ్రామం అడవి నుంచి జాతీయ రహదారిపై ఏనుగులు గుంపు తరలి వచ్చి, స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. కామాక్షనగర్, డుబురి కూడలి 53వ నంబర్ జాతీయ రహదారి వెంబడి మలాపురా గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. వాటిని సురక్షితంగా అడవిలోకి మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు చేసిన కృషి ఫలించింది.
ఉప ముఖ్యమంత్రికి
మాతృ వియోగం
భువనేశ్వర్: ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తల్లి లోభవతి పరిడా (89) ఆనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం రాత్రి కటక్ నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. లోభవతి పరిడా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పూరీ జిల్లా నువాహట్టొ నిభరణ నివాసి అయిన లోభవతి పరిడాకు ఐదురుగు సంతానం. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మూడో సంతానం. స్వగ్రామంలో నిర్వహించిన తల్లి అంత్యక్రియలకు ప్రభాతి పరిడా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment