ఉర్రూతలూగించారు..
పర్లాకిమిడి: స్థానిక రాంనగర్‌లో హైటెక్ ప్లాజా గౌండ్స్‌లో జరుగుతున్న పరలా కళా సంస్కృతి వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న మకర సంక్రాంతి వేడుకల్లో కనుమ రోజు ప్రముఖ సీని గాయకుడు, దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విచ్చేశారు. ఆయన తొలిచిత్రం నీకోసం (1999, చిత్రం, నువ్వునేను, సంతోషం తదితర తెలుగు చిత్రాల పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయనతోపాటు విశాఖపట్నం నుంచి వచ్చిన గాయని యామినీ, అరుణ్ ఆర్పీ పట్నాయక్ స్వరపరచిన పాటలను పాడారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశాలోని జయపురం తన స్వగ్రామమని, రాయగడలో విద్యాభ్యాసం జరిగిందన్నారు. చిత్ర రంగానికి అతి సులువుగా ప్రవేశం జరిగిందని, అప్పుడు అన్ని గేట్లు తెరిచి ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశ, విదేశాల్లో సంగీత కచేరీలు, పాటలకు నేపాథ్య గానం అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment