కలప దుంగలు స్వాధీనం
రాయగడ: రాయగడ అటవీ శాఖ పరిధిలోని టికిరి రేంజ్‌లో పెట్రొలింగ్ నిర్వహిస్తుండగా ఒక పికప్ వ్యాన్‌లో కలప దుంగలను రవాణా చేస్తున్న ఇద్దరిని అటవీ శాఖ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. పికప్ వ్యాతో సహా విలువైన 60 కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి అరెస్టయిన వారిలో ఖురిగా గ్రామానికి చెందిన పింటు జొడియా, అమరసింహగుడ గ్రామానికి చెందిన గురుబార్ నాయక్‌లు ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్టు రేంజర్ అనిల్ కుమార్ పాణిగ్రహి తెలిపారు. లెల్లిగుమ సంరక్షిత అడవుల నుంచి విలువైన వృక్షాలను నరికివేసి వాటిని అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పెట్రోలింగ్ బృందం ఈ మేరకు దాడులను నిర్వహించింది. నిందితుల నుంచిస్వాధీనం చేసుకున్న కలప విలువ సమారు 70 వేల రూపాయలు ఉంటుందని అంచనా. ఇద్దరి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
ఇద్దరి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment