నెల్లిమర్ల రూరల్: మండలంలోని తంగుడుబిల్లి గ్రామంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. తంగుడుబిల్లి గ్రామశివార్లలో కోడి పందాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రైడ్ చేయగా చెరువు సమీపంలో కోడి పందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు కోడి పుంజులు, రూ.1510 నగదు సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామని ఎస్సై తెలిపారు. కాగా సంక్రాంతి నేపథ్యంలో మండలంలోని తంగుడుబిల్లి, ఏటీ అగ్రహారం, మల్యాడ, తదితర గ్రామాల్లో కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి.
సామాజిక మరుగుదొడ్లు నిర్మాణం అవసరం
పార్వతీపురం: జిల్లాలో సామాజిక మరుగుదొడ్లు నిర్మాణం అవసరం వుందని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ అధికారులు, కలెక్టర్‌లతో స్వచ్ఛతపై వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛత దిశగా తీర్చుదిద్దుతున్నట్లు తెలిపారు. దీనికోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ సలహదారు శ్రీనివాసన్ సహాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో వలంటీర్లును నియమించి స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పార్వతీపురంలో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి నిర్దేశిత సంస్థ వచ్చి చేపట్టాల్సి వుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment