జీడి పప్పు ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలి
పార్వతీపురం: జిల్లాలో జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాలను సాలూరు, గుమ్మలక్ష్మీపురం, కురుపాంలలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ పార్వతీపురం, వీరఘట్టంలలో గిడ్డంగులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చని, అందుకు అవసరమైన యంత్ర పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాసెసింగ్ కేంద్రాలకు అవసరమైన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. సీతంపేట ప్రాంతంలో ఇప్పటికే ప్రాసెసింగ్ జరుగుతోం దని, వాటి ఆధారంగా లైసెన్స్ తదితర అంశాలను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రాసెసింగ్ కేంద్రాలలో సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై.సత్యంనాయుడు మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం, సాలూరు, మక్కువలలో రెండు చొప్పున ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు ప్రస్తుతానికి ఉన్నాయని వివరించారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment