నాటు సారాతో వ్యక్తి అరెస్టు
పలాస: పలాస మండలం సవర రామకృష్ణాపురం గ్రామానికి చెందిన సవర సోమేశ్వరరావును గురువారం కాశీబుగ్గ ఎకై ్సజ్‌పోలీసులు అరెస్టు చేశారు. అతను వద్ద నుంచి 4లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అనంతరం రిమాండుకు తరలించారు. ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టరు మల్లికార్జునరావు ఈ విషయం చెప్పారు.
మిల్లు హెల్పర్ ఆత్మహత్య
గార: వాడాడ పరిధిలోని జొన్నలపాడు వద్దనున్న ఓ రైసు మిల్లులో గురువారం బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన వికాస్ కుమార్ (20) ఊక గోడౌన్ గోడ స్తంభాలకు ఉరి వేసుకున్నాడు. తోటి మిల్లు ఆపరేటర్ గమనించి యజమానికి సమాచారం అందించాడు. పోలీ సులు, క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించామని, మరో ఆపరేటర్ సుకే ష్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ ఎం.చిరంజీవిరావు తెలిపారు.
ఆలయ నిర్మాణానికి
ఆర్మీ ఉద్యోగుల విరాళం
హిరమండలం: మండలంలోని ధనుపురం గ్రామంలో శ్రీ చెవిటమ్మతల్లి (గ్రామదేవత)ఆలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగులందరూ కలిసి రూ. లక్షా 50 వేలు ఆర్థిక సాయం చేశారు. గురువారం గ్రామ సర్పంచ్ దారపు ఢిల్లేశ్వరరావుకు, గ్రామ పెద్దల సమక్షంలో నగదును ఆర్మీ ఉద్యోగులు అందజేశారు. ఆర్మీ ఉద్యోగులను గ్రామస్తులు అభినందించారు.
కొత్తమ్మ తల్లికి
బంగారు కానుకలు
టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారికి దాతలు సుమారు లక్ష రూపాయల విలువైన బంగారు కానుకలను గురువారం అందజేశారు. కొత్తమ్మతల్లి అమ్మవారికి విశాఖపట్టణానికి చెందిన పిన్నింటి లిఖిత ఈ బంగారు కానుకలను అందజేశారు. ఆలయ కార్య నిర్వహణాధికారి వి.రాధాకృష్ణకు వీటిని అందజేశారు.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
పాతపట్నం: పాతపట్నం మండలంలోని చిన్నలోగిడి గ్రామ సమీపంలో పూరి నుంచి గుణుపూర్ వస్తున్న రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పెద్దలోగిడి రైల్వే గేటు చిన్నలోగిడి తరణి ఆలయం మధ్యలో గురువారం రాత్రి 7.30గంటలకు పూరి నుంచి గుణూపూర్ వస్తున్న రైలు కింద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అతడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. బ్లూ, బ్లాక్ టీ షర్ట్ నైట్ ఫ్యాంట్‌తో ఉన్నాడు. పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తి కాదని చిన్నలోగిడి గ్రామస్తులు చెబుతున్నారు. రైలు సుమారు 15 నిమిషాలు నిలిపివేయడం జరిగిందన్నారు.
వైద్యం పొందుతూ వ్యక్తి మృతి
కొత్తూరు: కొత్తూరుకు చెందిన సిల్లా చక్రవర్తి బు ధవారం బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా రు. ఆయన రాగోలులోని జెమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎండీ ఆమీర్ ఆలీ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పంచనామా, పోస్టుమార్టం చేసిన అనంతరం గురువారం మృతదేహాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు.
బంగారం చోరీ కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి గ్రామానికి చెందిన నాయన గోవింద ఫిర్యాదు మేరకు బంగారం చోరీ కేసును ఎచ్చెర్ల పోలీసులు గురువారం నమోదు చేశారు. గత ఏడాది తొమ్మిదో నెలలో 10 గ్రాముల బంగారం చైన్ అదృశ్యమైంది, గుర్తించటంలో జాప్యంతో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment