చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
శ్రీకాకుళం రూరల్: ఈనెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు.. గార మండలం కొమరవానిపేట గ్రామానికి చెందిన మురముండ రాజు (25) శ్రీకాకుళం నగరం గోవిందనగర్ పెదపాడు రోడ్డు మీదుగా తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నగరంలోకి వ స్తుండగా నరసన్నపేట నుంచి పెదపాడు మీదుగా వస్తున్న మహేంద్ర వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఆయన బుధరాత్రి రాత్రి మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment