సోంపేట: మండలంలోని బుసాబద్ర పంచాయతీ చౌఖుపేట గ్రామానికి చెందిన ఎం.రాజ్‌కుమార్ విశాఖ రైల్వేస్టేషన్‌లో గురువారం మృతి చెందినట్లు సోంపేట పోలీసులు తెలిపారు. రాజ్‌కుమార్ చౌఖుపేట గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. భార్య రాజ్యలక్ష్మి విశాఖపట్నంలో నివాసం ఉంటోంది. పండగ సందర్భంగా రాజ్‌కుమార్ విశాఖ పట్నంలోని భార్యపిల్లల వద్దకు వెళ్లాడు. పండగ అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రైల్వేస్టేషన్‌లో మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతికి గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోంపేట పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment