క్రికెట్ విజేత పరలా డామినేటర్స్
పర్లాకిమిడి: గత 11 రోజులుగా (జనవరి 4 నుంచి 15వ తేదీ) ఎలుకలవీధిలో కొనసాగిన జూనియర్ క్రాంతి నైట్ క్రికెట్ టోర్నమెంట్ కనుమనాడు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తిలకించడానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి తొలి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఫైనల్స్‌లో పర్లాకిమిడి డామినేటర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. మొత్తం 10 ఓవర్లకు 88 రన్స్ చేశారు. దేశీ బాయ్స్ వారికి ధీటుగా పది ఓవర్స్‌లో 87 బంతులు చేసి ఔటాయ్యారు. ఈ ఉత్కంఠ పోరు పర్లాకిమిడి డామానేటర్ జట్టు విన్నర్ కప్పుతోపాటు రూ.11,111/– కై వసం గెలుచుకోగా, రన్నర్స్‌గా దేశీబాయ్స్‌కు రూ.8000లు, కప్‌ను ఎమ్మెల్యే అందించారు. ఈ టోర్నమెంట్‌కు 15వ వార్డు కౌన్సిలర్ బంటి, బీజేడీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ నాయక్, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment