క్రీడలతో ఉజ్వల భవిష్యత్
రాయగడ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందని బాలికల రెండో ఎన్‌సీసీ బెటాలియన్ లెఫ్టనంట్ కల్నల్ రాకేష్ చంద్ర భరత్‌వాల్ అన్నారు. స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల 78వ వార్షిక క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాశానికి ఎంతో దోహద పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. గౌరవ అతిథిగా హాజరైన బాలికల ఎన్‌సీసీ రెండో బెటాలియన్ సుబేదార్ మేజర్ ఎస్.ఎం.రామానంద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే భవిష్యత్‌ను రూపొందించుకొవాలన్నారు. పాఠశాల హెచ్‌ఎం నమిత ప్రధాన్ తన వార్షిక నివేదకలో భాగంగా ప్రతీ ఏడాది ఇటువంటి తరహా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలు బుధవారంతో ముగిశాయన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఆసక్తిగా పలు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారన్నారు. పోటీల్లో గెలిపొందిన వారికి బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment