వేటకు వెళ్లి.. విగత జీవిగా మారి | - | Sakshi
Sakshi News home page

వేటకు వెళ్లి.. విగత జీవిగా మారి

Published Fri, Jan 17 2025 12:28 AM | Last Updated on Fri, Jan 17 2025 12:28 AM

వేటకు

వేటకు వెళ్లి.. విగత జీవిగా మారి

గార: బందరువానిపేటలో ఓ మత్స్యకారుడు వేటకు వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం కుందు గడ్డెయ్య (41) గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వేటకు వెళుతున్న సమయంలో రాకాసి అలలు రావడంతో పడవ నుంచి సమీపంలో తుళ్లి సముద్రంలో పడిపోయాడు. వలలు కూడా తనపై పడటం, అందులోనే చిక్కుకోవడంతో ఊపిరాడక చనిపోయాడు. భార్య బోడెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ ఎం.చిరంజీవిరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు రిమ్స్‌కు తరలించారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మత్స్యశాఖ అధికారులతో వివరాలు తెలుసుకుని, వేట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం మృతిని కుటుంబానికి అండగా ఉంటామని ఆ ప్రకటనలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వేటకు వెళ్లి.. విగత జీవిగా మారి1
1/1

వేటకు వెళ్లి.. విగత జీవిగా మారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement