లైసెన్సు ఉండాల్సిందే
శుక్రవారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2025
ఫొటో తీయాలంటే ..
భువనేశ్వర్:
ప్రపంచ ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయంలోని ఫొటోగ్రాఫర్లు, గైడ్‌లుకు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, వీరికి కనీస విద్యార్హత మెట్రిక్యులేషన్ ఉండాలని ఒడిశా హై కోర్టు ఆదేశించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంగణంలో ఫొటోగ్రాఫర్‌లు, గైడులకు కనీస విద్యార్హతలు, లైసెన్సు వంటి షరతులతో 2017 సంవత్సరంలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తు ప్రభావిత వర్గం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆశ్రయించింది. ఈ వ్యాజ్యం విచారణ పురస్కరించుకుని లోగడ జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉన్నత న్యాయ స్థానం సమర్థించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోణార్కు సూర్య దేవాలయం పరిసరాల్లో ఫొటోగ్రాఫర్లు, గైడులు కనీస విద్యార్హతలతో భారత పురావస్తు శాఖ జారీ చేసే లైసెన్సు కలిగి ఉండడం తప్పనిసరిగా పేర్కొంది. దీంతో వివాదానికి తెర పడింది. 154 మంది లైసెన్స్ లేని గైడులు, ఫొటోగ్రాఫర్‌ల బృందం 2017 సంవత్సరంలో భారత పురావస్తు శాఖ ఏఎస్‌ఐ జారీ చేసిన మార్గదర్శకాల్ని సవాలు చేసింది. హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్, జస్టిస్ సావిత్రి రొథొతో కూడిన ద్విసభ్య ధర్మాసనం లోగడ ఏక సభ్య ధర్మాసనం వెల్లడించిన తీర్పును సమర్థించింది. బారత పురావస్తు శాఖ విధానానికి కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని ద్విసభ్య ధర్మాసనం పునరుద్ఘాటించింది. అనేక దశాబ్దాలుగా ఈ అర్హతలు లేకుండానే ఆలయంలో పనిచేస్తున్నందున కొత్త విధానాలు తమ జీవనోపాధికి ముప్పు తెచ్చాయని ప్రభావిత వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం ప్రాథమిక హక్కులు సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. నిర్ణీత ఎంపిక ప్రక్రియ ద్వారా లైసెనన్స్ పొందడం ఈ హక్కులను ఉల్లంఘించదని నొక్కి చెప్పిన ఢిల్లీ హై కోర్టు తీర్పుతో ఏకీభవిస్తు తాజా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం రక్షిత స్మారక కేంద్రాల్లో గైడ్‌లు, ఫొటోగ్రాఫర్‌లకు వర్తింపజేసే నిబంధనలతో భారత పురావస్తు శాఖ కోణార్కు సూర్య దేవాలయం గైడులు, ఫొటోగ్రాఫర్లకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసినట్లు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ధర్మాసనం గుర్తించింది. ప్రఖ్యాత స్మారక పర్యాటక కేంద్రాల్లో వృత్తి నైపుణ్యం, క్షేత్ర ప్రాముఖ్యత పరిరక్షణ కోసం ఈ మార్గదర్శకాలు ప్రామాణికంగా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో కోణార్క్ సూర్య దేవాలయం ప్రాంగణంలో గైడులు, ఫొటోగ్రాఫర్లుగా పనిచేయడానికి అందరూ ప్రస్తుత ప్రామాణికలకు కట్టుబడి ఉండాలని హైకోర్టు పేర్కొంది. వీటి మినహాయింపు అభ్యర్థనని ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పటి వరకు భారత పురావస్తు శాఖ ఏఎస్‌ఐ తాజా మార్గదర్శకాల ప్రకార ప్రకారం కోణార్క్ సూర్య దేవాలయంలో పని చేసేందుకు 10 మంది గైడులు, ఫొటోగ్రాఫర్‌లకు లైసెన్స్‌లు జారీ చేసింది. హై కోర్టు తాజా ఉత్తర్వులతో ఈ ప్రక్రియ మరింత చురుగ్గా ముందుకు సాగుతుంది.
న్యూస్‌రీల్
కోణార్క్ సూర్య దేవాలయం ఫోటోగ్రాఫర్లు, గైడ్‌లకు ఏఎస్‌ఐ లైసెన్సు తప్పనిసరి
ఒడిశా హైకోర్టు స్పష్టీకరణ
Comments
Please login to add a commentAdd a comment