ఉద్యోగులకు ఆంక్షలు
గుట్కా నిషేధం..
పని వేళల్లో పాన్, గుట్కా ఇతరేతర ఏదైనా మత్తు పదార్థాల వినియోగంపై నిషేధం విధించారు. పూరీ శ్రీ మందిరం నిర్వాహకులు, అధికారులు, ఉద్యోగులంతా తమ ఆస్తుల వివరాలను ఈ నెల 31లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువు లోగా ఆస్తి వివరాలు దాఖలు చేయడంలో విఫలమైతే వార్షిక జీతాల పెంపు, పదోన్నతులు, ఆర్థిక ప్రోత్సాహకాలు నిలిపివేయడం వంటి పరిణామాలను ఎదుర్కో వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో జగన్నాథ ఆలయ సిబ్బందికి కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టారు. జవాబుదారీతనం, సామర్థ్యాన్ని పెంచే దక్పథంతో విధి నిర్వహణ నియమావళిని కట్టుదిట్టం చేశారు. ఇటీవల పరిపాలనా సమీక్ష సందర్భంగా క్రమశిక్షణ, సాంస్కృతిక సమగ్రతను అమలు చేసే ప్రయత్నంలో సమగ్రంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రధాన పాలనాధికారి(సీఏఓ) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి వెల్లడించారు.
మూడో వారం సమీక్ష ..
అధికారులు, సిబ్బంది పనితీరును ప్రతి నెల క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. నెలలో ప్రతి మూడో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సంప్రదాయ వస్త్ర ధారణ అధికారిక యూనిఫారం ధరించే వారు మినహా ఇతర సిబ్బంది, అధికారులు అందరూ ప్రతి శుక్రవారం సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. విధుల నిర్వహణలో పరధ్యానాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా అధికారులు, ఉద్యోగులకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగం నిషేధించారు. ఈ మార్గదర్శకాలు మరింత చురుకై న, బాధ్యతాయుతమైన పరిపాలనను పెంపొందించడానికి ఉద్దేశించినట్లు సీఏఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment