వ్యూ పాయింట్ వద్ద యువకుని మృతదేహం లభ్యం
రాయగడ: సదరు సమితి బాయిసింగి పంచాయతీ పరిధిలోని దుమ్మాగుడ సమీపంలో గల వ్యూ పాయింట్‌కు సమీపంలో ఒక యువకుని మృతదేహం ఆదివారం లభ్యమైంది. మృతుడిని కాశీపూర్ సమితి గొరఖ్‌పూర్ పంచాయతీలోని పటముండ గ్రామానికి చెందిన పవిత్ర నాయక్ (22)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. సదరు పోలీస్ స్టేషన్ ఐఐసీ కెకేబికే కుహరొ తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆదివారం దుమ్మాగుడలో గల వ్యూపాయింట్ సమీపంలో కొండపై ఒక యువకుని మృతదేహం పడి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పక్కనే ఒక మనీపర్సుతో పాటు క్రిమిసంహారక మందు బాటిల్ పడి ఉండటంతో.. ప్రాథమిక దర్యాప్తులో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తన కొడుకు ఆత్మహత్య చేసుకొని ఉండడని, ఎవరో హత్య చేసి ఉంటారని మృతుని కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment