మైకంచ్ పంచాయతీ సర్పంచ్‌పై దాడి
రాయగడ: జిల్లాలోని కాశీపూర్ సమితి మైకంచ్ పంచాయతీ సర్పంచ్ మస్తారామ్ మాఝిపై దాడి జరిగింది. శనివారం సాయంత్రం ఈ మేరకు బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐఐసి కెకేబికే కుహోరొ తెలియజేసిన వివరాల ప్రకారం.. మైకంచ్ సర్పంచు మాఝి పై స్థానిక సొయల్ కన్జర్వేషన్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకుమార్ నాయక్ అతని సహాచరుడు కలిసి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. సమితి పరిధిలోని కరంజి, కుపాఖల్, కుటుజిరి, జిరిఖొల్ తదితర ప్రాంతాల్లొ సిల్వర్ ప్లాంటేషన్ పనులు సొయల్ కంజర్వేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. దీనికి సంబంధించి గత కొద్ది నెలలుగా కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేదు. ఈ క్రమంలో మాఝి ఆయా ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లను పట్టుకుని స్థానిక కన్జర్వేటర్ కార్యాలయానికి వెళ్లి బిల్‌లు చెల్లించని విషయాన్ని సంబంధిత శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే అదే సమయంలో విధుల్లో లేని కుమార్ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతరం వారంతా తిరిగి వెళుతున్న సమయంలో జూనియర్ ఇంజినీర్, తన సహచరుడు మార్గ మధ్యమంలో కనిపించడంతో సర్పంచ్ మరి కొంతమంది కలిసి బిల్లుల విషయమై అడిగారు. అందుకు కోపగించుకున్న ఇంజినీర్ అతని సహచరులు దాడికి దిగారు. దాడిలో సర్పంచ్ గాయాలకు గురయ్యాడు. దీనిపై సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే తన పై సర్పంచు దాడి చేశాడని ఇంజనీర్ కుమార్ కూడా పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై కేసు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment