గణతంత్ర పరేడ్‌కు దేవస్మిత బెనియ
జయపురం: న్యూడిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల పరేడ్‌కు జయపురం విక్రమదేవ్ వర్సిటీ ఎన్‌సీసీ మహిళా వింగ్ సీనియర్ అండర్ ఆఫీసర్ దేవస్మిత బెనియకు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. దీనిలో భాగంగా ఈనెల 19వ తేదీన ఆమె న్యూఢిల్లీ బయల్దేరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి కేవలం ఆమె ఒక్కరికి మాత్రమే ఆహ్వానం రావడం విశేషం. ఆమెకు తోడుగా రాయగడ ఒడియా బాలికల ఎన్‌సీసీ బెటాలియన్ సీనియర్ జీసీఆర్ (గరల్స్ క్యాడెట్ ఇన్‌స్ట్రక్టర్) ప్రతిమ మింజ వెళ్లనున్నట్లు తెలిసింది.
గంజాయి సాగుపై ఉక్కుపాదం
రాయగడ: జిల్లాలో గంజాయి సాగుపై ఎకై ్సజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిలో భాగంగా గుడారి సమితి బండిలి అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగవుతున్న గంజాయి మొక్కలను పోలీసులు, ఎకై ్సజ్, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులను నిర్వహించి ధ్వంసం చేశారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగవుతుందన్న సమాచారం మేరకు దాడులు చేపట్టారు. మొత్తం 36 వేల గంజాయి మొక్కలను ఈ దాడుల్లో ధ్వంసం చేసి వాటిని నిప్పుపెట్టి తగలబెట్టారు.
విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించాలి
జయపురం: పట్టణంలో దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు అరికట్టేందుకు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించాలని అఖిల భారత భ్రష్టాచార వ్యతిరేక సంఘటన ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘటన ప్రతినిధులు జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మను గురువారం కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. నేరస్తులు, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడాలన్నారు. ముఖ్యంగా కెనాల్ రోడ్డు, గాంధీ జంక్షన్ రోడ్డు, బైపాస్ రోడ్డు, జయనగర్, జిల్లా కేంద్రాస్పత్రి రోడ్డుల్లో పెట్రోలింగ్ పెంచాలన్నారు. కార్యక్రమంలో అఖిల భారత భ్రష్టాచార వ్యతిరేక సంఘటన జయపురం అధ్యక్షుడు పూర్ణచంద్ర పాఢి, మోహన మాఝి, నరసింగ నాయక్, బాబూరాయ్, చిటి గొమాంగో, పూర్ణ చంద్ర మాఝి, రవీంద్ర పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నాటుసారా బట్టీలపై దాడులు
జయపురం: సమితిలోని కుములిపుట్ పంచాయతీ టంకుగుడ గ్రామ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న మూడు నాటుసారా బట్టీలపై దాడులు జరిపినట్లు ఎకై ్సజ్ అధికారి శుభ్రత్ కేశరీ హిరన్ తెలిపారు. దీనిలో భాగంగా 80 లీటర్ల నాటుసారాతో పాటు సారా వండేందుకు సిద్ధం చేసిన 2,300 లీటర్ల ఇప్ప ఊటను పారవేశామని వెల్లడించారు. పారవేసిన సారా, ఊట విలువ రూ.లక్షకు పైనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ అదనపు సబ్ ఇన్‌స్పెక్టర్ బలరాం దాస్ నేతృత్వంలో సిబ్బంది పాల్గొన్నారు. ఎకై ్సజ్ సిబ్బందిని చూసి అక్కడ నుంచి సారా తయారు చేసేవారు పరారయ్యారు. అలాగే దాడులు జరిపి వస్తున్న సిబ్బందికి తెలిపుట్ గ్రామ రహదారిలో ఒక వ్యక్తి నాటుసారా తీసుకెళ్తుండగా కనిపించడంతో అరెస్టు చేశారన్నారు. నిందితుడు తెలిపుట్ గ్రామానికి చెందిన త్రినాథ్‌గా తెలిపారు.
బైక్ చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
రాయగడ: బైక్ చోరీ కేసులో సదరు పోలీసులు ఇద్దరిని శనివారం అరెస్టు చేసినట్లు ఐఐసీ కేకేబీకే కుహరోతెలిపారు. మంగళవారం ఎంఐ డివిజన్ కార్యాలయం ఎదుట రింకు శేఠి అనే వ్యక్తి బైకు చోరీకి గురైంది. ఎస్‌ఐ రుద్రమాధవ్ ముదులి దర్యాప్తు చేపట్టగా.. సీసీటీవీ ఆధారంగా మహాదేవ్ సతాసి, ఎం.కళ్యాణ్‌లను నిందితులుగా గుర్తించారు. అరెస్టు చేసి బైకును స్వాధీనం చేసుకున్నారు.
ఆహ్వానం అందుకున్న దేవస్మిత బెనియ
Comments
Please login to add a commentAdd a comment