రాయగడ: స్థానిక న్యూకాలనీలో ఒక వ్యాపారి నుంచి స్కూటీతో సహా రూ.5 లక్షల నగదును గుర్తు తెలియని దుండగుడు దొంగిలించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గౌరీ శంకరరావు అనే వ్యక్తి వ్యాపార లావాదేవీల్లో భాగంగా రూ.5 లక్షలు స్కూటీ డిక్కీలో ఉంచి, న్యూకాలనీలోని ఒక దుకాణం వద్దకు వెళ్లి సామాన్లు కొనుగోలు చేశాడు. అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి స్కూటీని దొంగిలించాడు. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూటీలో రూ.5 లక్షలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కళాశాల విద్యార్థినులకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందజేత
Comments
Please login to add a commentAdd a comment