భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ నెల 13 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న శాసన సభ స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ నెల 17న శాసన సభలో ప్రవేశపెట్టనున్న 2025–26 ఆర్థిక సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి సమర్పించనున్న బడ్జెట్ ఇది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.65 లక్షల కోట్ల తొలి బడ్జెట్‌ను గత ఏడాది జూలై 25న ముఖ్యమంత్రి సమర్పించారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ పరిమాణం పెరుగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025–26 బడ్జెటు పరిమాణం రూ. 2.75 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో మంజూరైన కేటాయింపుల నుంచి నిధుల్ని ఈ ఏడాది జనవరి నెల చివరి వరకు ఖర్చులు చేయడంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment