అడవులలో నిప్పు పెట్టవద్దు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహన బ్లాక్ అటవీ రేంజ్ పరిధిలోని మోహన, అడవ, రాయిపంక, బిరికోట్ అడవులలో నిప్పు పెట్టవద్దని అటవీ శాఖ సిబ్బంది బైక్ ర్యాలీ గ్రామగ్రామాన చేపట్టారు. ఈ బైక్ ర్యాలీని మోహన అటవీ రేంజ్ అధికారి లక్ష్మీ ప్రసాద్ బిశోయి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పోడు వ్యవసాయం కోసం అడవులను గిరిజనులు గజపతి జిల్లాలో తగుల బెడుతుంటారు. దీని వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, వన్య ప్రాణులకు హాని జరుగుతుందని మోహన అటవీ రేంజ్ అధికారి లక్ష్మీ ప్రసాద్ బిశోయి అన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది వృద్ధ ఆదివాసీ మహిళలకు నిత్యావసర సరుకులు శుక్రవారం పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, ఉప్పు, నూనె, బంగాళదుంపలు వంటి పది రకాల నిత్యావసర వస్తువులను అందజేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. ప్రతినెలా ఈ తరహా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
చోరీకి గురైన స్కూటీ నదిలో లభ్యం
రాయగడ: స్థానిక పీహెచ్‌డీ కాళీమాత మందిరం సమీపంలో జంఝావతి నదిలో ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం న్యూకాలనీలో ఒక వ్యాపారి నుంచి స్కూటీతో సహా రూ.5 లక్షలు దొంగలించిన ఘటనకు సంబంధించి దుండగుడు స్యూటీని నదిలో పడివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టి.గౌరీ శంకరరావు తన వ్యాపార లావాదేవీల్లో భాగంగా రూ.5 లక్షలు స్కూటీ డిక్కీలో పెట్టి, న్యూకాలనీలోని ఒక దుకాణం వద్ద సామాన్లు ఖరీదు చేశాడు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు స్కూటీతో సహా రూ.5 లక్షలు దొంగిలించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి స్థానిక జంఝావతి నదిలో కొంతమంది స్నానాలు చేస్తున్న సమయంలో నది మధ్యలో స్కూటీ కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఐఐసీ కేకేబీకే కుహ రో, ఇతర పోలీస్ సిబ్బంది సంఘటన స్థలా నికి చేరుకొని స్కూటీని స్వాధీనం చేసుకున్నా రు. స్కూటీ తాళాలు కూడా స్కూటీకే వదిలేసిన దుండగుడు, డిక్కీలో నగదును మాత్రం తీసుకెళ్లిపోయాడు. స్వాధీనం చేసుకున్న స్కూటీని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
బడికి తాళం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బొడిగాం గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు, గ్రామస్తులు కలసి తాళాలు వేశారు. పాఠశాలలో ఎంతో కాలంగా నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా.. ఫలితం లేకపోవడంతో మరో మార్గం లేక గురువారం బడికి తాళాలు వేశారు. పాఠశాలకు సక్రమంగా సకాలంలో ఉపాధ్యాయులు రావటం లేదని, బదిలీ అయిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తవారిని నియమించటం లేదని తమ చదువులు సజావుగా సాగడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యా విభాగ అధికారులకు, జిల్లా అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం ఉండడం లేదన్నారు. అందుకే మరో మార్గం లేక పాఠశాలకు తాళాలు వేసినట్లు వెల్లడించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment