వైద్యులకు సేవాభావం అవసరం
పెదకాకాని: రోగులకు సేవాభావంతో వైద్యులు సేవలు అందించాలని ఢిల్లీలో ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ రితూ దుగ్గల్ అన్నారు. పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు సిబార్ దంత వైద్య కళాశాలలో మంగళవారం 24వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. కళాశాల డీన్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా భారతీయ దంత వైద్యమండలి మెంబర్ డాక్టర్ పి. రేవతి హాజరయ్యారు. డీన్ మాట్లాడుతూ.. కళాశాల కృషి, విద్యార్థుల ప్రతిభ తదితరాలను వివరించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ రితూ దుగ్గల్ మాట్లాడుతూ.. కళాశాల జీవితం ఎంతో మధురమైనదన్నారు. ఇక్కడే జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నారు. మంచి వైద్యులుగా గుర్తింపు పొందడానికి కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను మరవరాదని సూచించారు. 95 మంది విద్యార్థులు బీడీఎస్ పట్టాలు అందుకున్నారు. కార్యక్రమములో కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి.కృష్ణమోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ బీవీ రమణారెడ్డి, వైస్ డీన్లు డాక్టర్ ఎం.ప్రకాష్, డాక్టర్ బి.నగేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment