శాంతిభద్రతలు కాపాడటమే మా బాధ్యత
ఎస్పీ కంచర్ల శ్రీనివాసరావు
మాచర్ల: జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారి పై ప్రత్యేక దృష్టి సారించి ఆయా పోలీసు స్టేషన్‌ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రిమినల్స్‌ను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కంచర్ల శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం మాచర్ల పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఆయన డివిజినల్ సర్కిల్ పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యల తీసుకుంటూ పోలీసు శాఖ ముందుకెళ్తుందని వివరించారు. ఆయన వెంట డీఎస్పీ జగదీష్, అర్బన్ సీఐ ప్రభాకర్, వివిధ పోలీసు అధికారులున్నారు.
అక్రమ రవాణా అడ్డుకోవాలి
దాచేపల్లి: రాష్ట్ర సరిహద్దు చెక్‌పొస్ట్‌ల మీదుగా ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. స్టేషన్ అధికారులు, సిబ్బందితో మాట్లాడా రు. పలువురు అర్జీదారుల నుంచి అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర సరిహద్దు చెక్‌పొస్ట్‌లను ఆయన పరిశీలించి స్థానిక పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. చెక్‌పొస్ట్‌లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్పమత్తంగా ఉండాలని, ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత గంజాయి, మద్యం, ఇసుక, రవాణా కాకుండా పటిష్టమైన తనిఖీలు చేప ట్టలని ఆయన ఆదేశించారు. దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సమస్యలపై స్టేషన్‌కి వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఎస్పీ వెంట గురజాల డీఎస్పీ జగదీష్, సీఐ భాస్కర్, ఎస్‌ఐలు సౌదర్యరాజన్, పాపారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment