ప్రతి విద్యార్థికీ హెల్త్ కార్డులు
నరసరావుపేట: డిసెంబర్ ఏడో తేదీన ప్రతి పాఠశాలలో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‘ నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ చెప్పారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి ఆయన నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. శశిధర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ హెల్త్ కార్డులు జారీ చేస్తామని, ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఐదు పాఠశాలలను ఎంపిక చేసి అందులోని విద్యార్థులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. బడి వైపు ఒక అడుగు–తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులపై చర్చించాలని, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా ఒక పాఠశాలలోనే కాకుండా ప్రతి పాఠశాలలోనూ ఎవరో ఒకరు హాజరయ్యేలా చూసుకోవాలన్నారు. ఆ పాఠశాల నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులు, ఆ పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ఆహ్వానించాలన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్‌పై తల్లిదండ్రులతో చర్చించిన తదుపరి తల్లులతో రంగవల్లులు తీర్చిదిద్దే ఏర్పాటు చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో తల్లిదండ్రులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను గుర్తిస్తూ త్రీ స్టార్, టు స్టార్, వన్ స్టార్ క్యాటగిరీల ప్రకారం ఎంపిక చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలల్లో మౌలిక
వసతులపై స్టార్ రేటింగ్
కలెక్టర్లకు సూచించిన
ప్రిన్సిపల్ సెక్రటరీ శశిధర్
Comments
Please login to add a commentAdd a comment