ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
క్రోసూరు: ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని డీఈఓ ఎల్.చంద్రకళ చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా క్రోసూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రాన్ని మంగళవారం డీఈఓ సందర్శించారు. ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రత్యేకఅవసరాల పిల్లలను చూసి తల్లిదండ్రులు కుంగిపోకుండా మనోధైర్యంతో ఉండాలని, పిల్లలకు తోడుగా నిలవాలని సూచించారు. అనంతరం ఆటపాటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. భవిత కేంద్రం ఉపాధ్యాయులను, ఫిజియోధెరపిస్టును అభినందించారు. అనంతరం క్రోసూరులోని కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. అన్ని తరగతుల బాలికలతో మాట్లాడారు. స్టోర్ రూం, వంటగది, పాఠశాల ఆవరణను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 గణేష్, కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరాప్రియదర్శి, ఉపాధ్యాయులు, జెడ్పీపాఠశాల హెచ్‌ఎం జి.రామాంజనేయులు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment