అడ్డంగా దోచేయ్..
అధికార పార్టీలోని లుకలుకలు బయటపడి, పరస్పర ఫిర్యాదులతో ఇటీవల కొంతకాలంగా ఆగిన ఇసుక అక్రమ రవాణా.. ఏమైందో ఏమో.. సంక్రాంతి అనంతరం మళ్లీ ఊపందుకుంది. ఈ దఫా పెద్ద పెద్ద యంత్రాలతో నదీ గర్భానికి, ఎన్‌జీటీ నిబంధనలకు సైతం తూట్లు పెడుతూ ఇసుక అడ్డంగా తోడేస్తూ.. నదికి అడ్డంగా నిర్మించిన రహదారిపై యథేచ్ఛగా తరలిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో రైతుల ఇబ్బందులను గాలికొదిలేశారు.. అడ్డుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
● నదికి అడ్డంగా రోడ్లు.. నదీ గర్భానికి తూట్లు ● ఆ రోడ్డు నుంచే యథేచ్ఛగా రవాణా ● పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వకాలు ● నదికి అడ్డంగా రహదారితో ప్రశ్నార్థకంగా వ్యవసాయ భూములకు సాగునీరు ● రైతుల ఇబ్బందులు పట్టించుకోని అక్రమార్కులు ● ఇటీవల కొంతకాలం ఆగిన తవ్వకాలు ● మళ్లీ అక్రమ దందాకు తెరలేపిన వైనం ● ప్రశ్నించే సాహసం చేయని అధికారులు
ఎలాంటి అనుమతులు చూపించలేదు
అనుమతులు లేకుండా నదికి అడ్డంగా రోడ్డు వేయెద్దని, భారీ యంత్రాలతో తవ్వకాలు చేయవద్దని గతంలోనే రీచ్ నిర్వాహకులకు స్పష్టంగా చెప్పాం. అప్పుడు ఇసుక రవాణాను నిలిపి వేశారు. మళ్లీ ఇప్పుడు ఇసుక రవాణా, తవ్వకాలు నిర్వహిస్తున్న విషయం తెలియదు.. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు మాకు ఇంతవరకు చూపించలేదు. మా సిబ్బందిని పంపి అడ్డుకుంటాం.
– జి.శ్రీనివాసయాదవ్, తహసీల్దార్, అచ్చంపేట
కోనూరులో మళ్లీ ఇసుక అక్రమ దందా
Comments
Please login to add a commentAdd a comment