మాచర్ల: పట్టణంలో ఎరువుల వ్యాపారి రూ. కోట్లు అప్పు చేసి పది రోజులుగా కనిపించకుండా వెళ్లిపోయాడు. వ్యాపారి ఆచూకీ కోసం అప్పులు ఇచ్చిన వారు ఆందోళనలో ఉన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎరువుల వ్యాపారం చేస్తూ చిట్టీపాటల వారికి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితులు, తదితర వారి వద్ద రూ. 2.50 కోట్ల వరకు అప్పు చేశాడు. దుకాణానికి తాళాలు వేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారి కోసం గాలింపులు చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన చేసి పెద్దలతో మాట్లాడుకుని గ్రామంలోకి అడుగు పెట్టాడు. జనంలో నమ్మకం పెంచుకుని అప్పులు చేసి మళ్లీ కనిపించకుండా పోవడంపై పట్టణంలో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment