జెండా దిమ్మె కూల్చిన వారిపై చర్యలు తీసుకోండి
సత్తెనపల్లి: సత్తెనపల్లిలోని 18వ వార్డులో వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను కూల్చినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ఈమేరకు శనివారం సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు, మున్సిపల్ మేనేజర్ ఎన్.సాంబశివరావులను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ 18వ వార్డులో జెండా చెట్టు దగ్గర ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను శుక్రవారం రాత్రి క్రేన్‌తో గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారన్నారు. వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను పగలగొట్టిన దోషులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జెండా దిమ్మెలను కూల్చడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇలాంటి ఘటనలు చేపట్టి రెచ్చగొట్టే ధోరణులను మానుకోవాలని హితవు పలికారు. వినతి పత్రం అందించిన వారిలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు రోళ్ల మాధవి, వైఎస్సార్ సీపీ నాయకుడు చలంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్‌లు షేక్ నాగూర్‌మీరాన్, రమావత్ కోటేశ్వరరావు నాయక్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ మౌలాలి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్, తుమ్మల వెంకటేశ్వర రావు, తిరుపతిరావు, చంటి, తదితరులు ఉన్నారు.
డీఎస్పీ, మున్సిపల్ మేనేజర్లకువైఎస్సార్ సీపీ నేతల వినతిపత్రాలు
Comments
Please login to add a commentAdd a comment