జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే
నరసరావుపేట ఈస్ట్: విద్యావంతులైన యువతకు నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం జేసీ సూరజ్ గనోరే తన కార్యాలయంలో పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఐటీఐ, పాలిటెక్నిక్, ఏదేని డిగ్రీ, బీఫార్మసీ వంటి విద్యార్హతలు, 21 నుంచి 24 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాల కలిగిఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను https:// pminternship.mca.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.5వేలు చొప్పున 12 నెలలు పాటు అందిస్తారని తెలిపారు. ఈనెల 21వతేదీ తుది గడువుగా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7702921219, 9985212347 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు, అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.సిహెచ్.రామాంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు.
‘ఉల్లాస్’లో నిరక్షరాస్యులకు విద్య
నరసరావుపేట: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో చదువురాని స్వయం సహాయక సంఘ సభ్యులు, ఇతరులు ఉల్లాస్ శిక్షణా కార్యక్రమంలో తమ పేర్లను నమోదు చేసుకొని చదువు నేర్చుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పథక సంచాలకులు బాలూనాయక్ కోరారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ అతిథి గృహంలో ఏర్పాటుచేసిను జిల్లాస్థాయి ఉల్లాస్ శిక్షణా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సాధికారత సాధించేందుకు నిరక్షరాస్యులు తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. వయోజన విద్య డిప్యుటీ డైరెక్టర్ జగన్మోహనరావు, నోడల్ అధికారి మల్లిఖార్జునరావు, సూపర్‌వైజర్లు శిరీష, రవి, గోవర్ధన్, నాగేశ్వరావు, జిల్లా సమాఖ్య ప్రతినిధి హనుమా నాయక్, ఏపీఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment