ప్రభుత్వాన్ని నిలదీద్దాం
మాటమీద నిలబడేలా..
విద్యార్థులకు న్యాయం కోసం...
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరించేదని, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆఖరు త్రైమాసికం ఫీజును ముందుగానే చెల్లించేదని బొత్స గుర్తు చేశారు. ఆ మాదిరిగానే ఎన్నికలకు ముందు కూడా చెల్లించడానికి సిద్ధమైతే టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేసి అడ్డుకున్నారని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాతైనా కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కాలేజీల నుంచి సర్టిఫికెట్లు పొందడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పరీక్షలకు కూడా కూర్చోనివ్వట్లేదన్నారు. ఆ ఫీజు బకాయిలు చెల్లించాలనే డిమాండుతో జనవరి 3న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇస్తామని బొత్స వెల్లడించారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
‘మాట మీద నిలబడటం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం టీడీపీ నాయకులు ఇంటావంటా లేదు. వారి తీరే అంతేనని మనమూ ఊరుకోకూడదు. టీడీపీ కూటమి ప్రభుత్వంతో మోసపోయిన ప్రజలకు బాసటగా నిలవాలి. ఇప్పుడీ పరిస్థితుల్లో మనమూ నిలబడకపోతే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరు మారాలని కోరుతూ ఈనెల 13న విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్‌సీపీ నాయకులంతా వెళ్లి వినతిపత్రం ఇద్దాం. ఆరునెలల కాలంలోనే రెండుసార్లు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ 27వ తేదీన విద్యుత్‌శాఖ ఎస్‌ఈలకు మెమోరాండం సమర్పిద్దాం. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో జనవరి 3న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇద్దాం. మాటమీద నిలబడాలని కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామ’ని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో నష్టపోతున్న ప్రజలకు బాసటగా నిలవాలన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పార్టీ సమావేశంలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దఫదఫాలుగా నిరసన కార్యక్రమాల సన్నద్ధతలో భాగంగా సోమవారం సాయంత్రం పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో విజయనగరంలోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి పాము ల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, శాసనమండలి విప్ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్ప లనాయుడు, విశ్వాసరాయి కళావతి, అలజంగి జో గారావు, శోభా హైమావతి, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, వేచలపు చినరామునాయుడు, కేవీ సూర్యనారాయణరాజు, గుల్లిపల్లి గణేష్, నారాయణమూర్తిరాజు తదితరులు హాజరయ్యారు.
ఽరైతులకు బాసటగా...
పార్టీ నాయకులతో సమావేశం అనంతరం బొత్స సత్యనారాయ ణ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శాంతియుత నిరస న కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధత నిమిత్తం ఇరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇటీవల తుపానులు, అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోయాయన్నారు. ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. కనీస మద్దతు ధర కన్నా రెండు మూడొందలు తక్కువకే అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయాన్ని రూ.20 వేలకు పెంచి ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ నాయకులు చెప్పారు. ఆ డబ్బులు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. పంటల బీమా ప్రీమియం కూడా గత ప్రభుత్వం చెల్లించేదని, ఇప్పుడు రైతులే చెల్లించుకోవాలని కూటమి ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు. ఆర్థిక వెసులుబాటులేని రైతులు ఆ ప్రీమి యం చెల్లించకపోతే ప్రకృతి విపత్తులతో నష్టపోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ధాన్యం సక్రమంగా ప్రభుత్వమే కొనుగోలుచేయాలని, పెట్టుబడి సాయం అందించాలని, పంటల బీమా ప్రీమియం చెల్లించాలనే డిమాండ్లతో ఈనెల 13న ఇరు జిల్లాల్లోనూ కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.
విద్యుత్ చార్జీలు పెంచొద్దని...
ప్రజలపై విద్యుత్‌చార్జీల భారం మోపబోమని, అవసరమైతే తగ్గిస్తామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే రెండుసార్లు పెంచారని బొత్స ఆవేదన వ్యక్తం చేశా రు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రతినెలా రూ.1.20 వరకూ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిందని, ఇది చాలా అభ్యంతరకరమని అన్నారు. వినియోగదారులపై భారం మోపడం అన్యాయమన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన ఇరు జిల్లాల్లోనూ విద్యుత్‌శాఖ కార్యాలయాలకు వెళ్లి ఎస్‌ఈలకు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ప్రజలపై భారం మోపకుండా రూ.15వేల కోట్ల మేరకు ప్రభుత్వమే డిస్కమ్‌లకు సబ్సిడీగా ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరతామన్నారు.
పింఛన్ల పెంపు తప్ప ఎన్నికల హామీలన్నీ తుస్ గత ప్రభుత్వంపై బురద చల్లడం ఒక్కటే పని
మోసపోయిన ప్రజలకు బాసటగా నిలవాలి
మనమూ నిలబడకపోతే ప్రజలకు తీవ్ర నష్టం
రైతుల కోసం 13న కలెక్టర్లకు వినతిపత్రం
విద్యుత్ చార్జీలు తగ్గించాలని 27న నిరసన
విద్యార్థుల ఫీజుల కోసం జనవరి 3న పోరు
శాసనమండలి ప్రతిపక్షనేత
బొత్స సత్యనారాయణ
హాజరైన వైఎస్సార్ సీపీ శ్రేణులు
Comments
Please login to add a commentAdd a comment