నేడు న్యాయ అవగాహన సదస్సు
పార్వతీపురంటౌన్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా రెండవ అదనపు జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేసి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రకటనలో కోరారు.
కుందరతిరువాడలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని కుందరతిరువాడ పరిసర ప్రాంతాలలో సోమవారం ఏనుగులు దర్శనమిచ్చాయి. వరిధాన్యం కళ్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే అరటిపంట కోతదశలో ఉందని, చెరకు, పామాయిల్ పంటలు ఉండడంతో పంటలను ధ్వంసం చేస్తాయని వాపోతున్నారు. మూడు రోజుల నుంచి ఏనుగులు ఇక్కడే ఉండడంతో రాత్రిపూట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులను తరలించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
మరింత చేరువగా ‘సంకల్పం’
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్‌శాఖ చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రచార రథంతో ప్రజలకు మరింత చేరువ చేస్తున్నట్టు ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఒక కూడలిలో వాహనాన్ని నిలిపి, డ్రగ్స్ వినియో గం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నట్టు చెప్పారు. తోటపాలెం కళాశాల వద్ద వా హనాన్ని నిలిపి, మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు ఏ విధంగా ఛిద్రమవుతున్నాయో తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను సోమవారం ప్రదర్శించారు. వీటిని యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తిలకించారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్‌ఐలు ప్రసన్నకుమార్, కిరణ్‌కుమార్‌నాయు డు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గురుకుల పోస్టుల భర్తీకి
12న ఇంటర్వ్యూలు
వేపాడ: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పార్ట్‌టైమ్ ప్రాతిపదికన భర్తీ చేస్తా మని జిల్లా సమన్వయకర్త టి.ఎమ్.ప్లోరెన్స్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 12న ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల గురుకుల పాఠశాలలో డెమోకమ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. వేపాడ, వియ్యంపేట, నెల్లిమర్ల గురుకులాల్లో గణిత సబ్జెక్టు, భామినిలో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు మహిళా అభ్య ర్థులు, నెల్లిమర్లలో సివిక్స్, కొప్పెర్లలో బోటనీ పోస్టుకు పురుష అభ్యర్థులను నియమిస్తామన్నారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులకు తక్కువ కాకుండా ఉండాలని, మెథడాలజీతో బీఎడ్, సంబంధిత సబ్జెక్టులో టెట్ పేపరు–2లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్, లేదా విజయనగరం ఆర్‌అండ్‌బీ కూడలి వద్ద సమన్వయకర్త వారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
త్వరలో అన్నదాత సుఖీభవ అమలు
● మంత్రి అచ్చెన్నాయుడు
పార్వతీపురం: త్వరలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20వేలు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడచిన ఆరు నెలల్లో ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టినట్టు వెల్లడించారు. రైతులు ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేసేందుకు రూ.145కోట్లతో యంత్ర పరికరాలను సమకూర్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment