పింఛన్‌దారుల అర్హతలపై ఆరా
పూసపాటిరేగ: సామాజిక పింఛన్లలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. మండలంలోని వెల్దూరు సచివాలయంలో డీఆర్‌డీఏ పీడీ కల్యాణచక్రవర్తి ఆధ్వర్యంలో 11 బృందాలు 437 మంది ఫించన్‌దారుల అర్హతలపై విచారణ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళితో ఇంటింటికీ వెళ్లి విచారణ జరిపారు. పింఛన్‌దారుడి వయస్సు, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు లోపల ఉందా? లేదా?, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా?, ఇంట్లో ఎవరికై నా ప్రభుత్వ ఉద్యోగం ఉందా?, ఇంటి విస్తీర్ణం, వితంతు పింఛన్‌దారులకు భర్త డెత్ సర్టిఫికెట్, ఒంటరి మహిళలకు తహసీల్దార్ జారీ చేసిన పత్రం తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేకయాప్‌లో అర్హతలు నమోదుచేస్తున్నారు. వెల్దూరు పంచాయతీ పరిధిలోని కిలుగుపే ట, బూరపేట, కాలపురెడ్డి పేట, నడిపల్లి, చిననడిపల్లి గ్రామాల్లో పింఛన్‌దారుల అర్హతలపై ఆరా తీశా రు. కార్యక్రమంలో నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ ఎంపీడీఓలు కె.రామకృష్ణరాజు, ఎం.వి.కామేశ్వరరావు, ఎం.రాధిక, వై.భవానీతో పాటు వెలుగు ఏపీఎంలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment