మానవ హక్కుల రక్షణకోసం ఉద్యమిద్దాం
విజయనగరం పూల్‌బాగ్: మానవ హక్కుల రక్షణకోసం ఉద్యమిద్దామని ఐద్వా విజయనగరం జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ పిలుపునిచ్చారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 46 వ డివిజన్‌లో ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు మహిళలపై హ త్యలు ఆత్యాచారాలు జరుగుతున్నాయని, బాలల హక్కులు హరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులు రోజురోజుకూ పాలకులు హరిస్తున్నారని ఆరోపించారు. మరో వైపు మనువాద రాజ్యాంగం అమలులోకి తెచ్చేందుకు మతోన్మాద వాదులు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. లౌకిక తత్వం, సమానత్వం, మానవ హక్కుల రక్షణ కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ
Comments
Please login to add a commentAdd a comment