రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌లో జిల్లా విద్యార్థులకు బహుమతు
నెల్లిమర్ల: విజయనగరంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో జిల్లా విద్యార్థులు బహుమతులు సాధించినట్లు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ జి.పగడాలమ్మ చెప్పారు. దృశ్యకళా పోటీలలో నెల్లిమర్ల ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పి సౌజన్య మణి ప్రథమ స్థానం సాధించింది. వాయిద్య సంగీత పోటీల్లో విజయనగరంలోని ప్రభాకర్ ఐఐటీ అకాడమీలో తొమ్మిదో తరగతి విద్యార్థి బీఏ శివాత్మిక ప్రథమం స్థానం కై వసం చేసుకుంది. సంప్రదాయ కథలు చెప్పడం పోటీలలో నెల్లిమర్ల ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల ఇంటర్‌మీడియట్ విద్యార్థిని ఎస్.తేజశ్విని ప్రథమ, తొమ్మిదో తరగతి విద్యార్థిని బి.నవ్య ద్వితీయ స్థానం సాధించారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొంది జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను డైట్ ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ, అధ్యాపకులు రవికుమార్, సూర్యారావు, రామకృష్ణ, ఈశ్వరరావులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment