నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి దిబ్బేశ్వర స్వామి ఆలయ సమీపంలోని తోటల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల రజక సంఘం ఆత్మీయ సమావేశం మంగళవారం ఘనంగా జరిగింది.
రజక సామాజిక వర్గంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులను సంఘం సభ్యులు సన్మానించి వారి సేవలను కొనియాడారు. అంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు పోరాడదామని వారంతా తీర్మానించారు. అనంతరం అంతా కలిసి సహఫంక్తి భోజనాలు చేసి సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తంగేటి భాస్కరరావు, కార్యదర్శి జంపా చిన్న, చైర్మన్ సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment