జాతీయస్థాయి పోటీలకు పట్టణ క్రీడాకారుల ఎంపిక
విజయనగరం అర్బన్: హిమాచల్ ప్రదేశ్‌లో జనవరిలో జరిగే అంతర్‌యూనివర్సిటీ జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ కళాశాల క్రీడాకారులు పలువురు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సౌత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆంధ్రయూనివర్సిటీ తరఫున పోటీ పడిన పల్లవి 71 కేజీల విభాగంలో 90 కేజీల స్నాచ్, 117 కేజీల క్లీన్ అండ్ జెర్క్ మొత్తం 202 కేజీల బరువును ఎత్తి బంగారు పతకాన్ని సాధించింది. పల్లవితోపాటు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన ఎ.యశశ్రీ, బి.నీరజ, ఆర్.రాంబాబు జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక య్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయిదేవమణి తెలిపారు. విజేతలకు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల యాజమాన్య సభ్యులు ఎం.అనురాధ, ఎం.వివేక్, పీడీ ఎస్‌హెచ్‌ప్రసాద్, కోచ్ చల్లా రాము, కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
పెదకుదమలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని పెదకుదమ పరిసర ప్రాంతాలలో మంగళవారం ఏనుగులు దర్శనమిచ్చాయి. వరిధాన్యం కళ్లాల్లో ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.అరటిపంట కోతదశలో ఉందని, చెరకు,పామాయిల్ పంటలు చివరి దశలో ఉండడంతో పంటలను ధ్వంసం చేస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి ఏనుగులు ఇక్కడే ఉండడంతో రాత్రిపూట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఏనుగులను తరలించే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయం గమనించిన వీఆర్వో పువ్వల మహేంద్ర కురుపాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు.
ఆటో నుంచి జారిపడి మహిళ..
పూసపాటిరేగ: మండలంలోని సీహెచ్ అగ్రహారం జంక్షన్ జాతీయరహదారిపై ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ జారిపడి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదం వివరాల్లోకి వెళ్తే గోవిందపురం గ్రామానికి చెందిన కసిరెడ్డి వరలక్ష్మి(45) గ్రామం నుంచి ఆటోలో ప్రయాణం చేస్తుండగా సీహెచ్ అగ్రహారం సమీపంలో ఆటోలో నుంచి జారిపడడంతో తలకు బలమైన గాయం తగిలి సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గర్భిణుల పట్ల నిర్లక్ష్యం తగదు
భామిని: ఆస్పత్రికి వచ్చే గర్భిణుల పట్ల నిర్లక్ష్యం వీడి మంచి ఆరోగ్య సూత్రాలు వివరించా లని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అదికారి య శ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన భామిని,బాలేరు,బత్తిలి పీహెచ్‌సీలను సందర్శించి రికార్డులను పరిశీలించా రు. బత్తిలి ఎస్‌ఓ గర్భిణుల వివరాలు చెప్పలేకపోవడంతో పీఓ అసహనం వెలిబుచ్చారు. అ లాగే భామిని పీహెచ్‌సీలో బయో కెమికల్స్‌ను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని గు ర్తించి సిబ్బందిపై మండిపడ్డారు. ప్రతి ఆస్పత్రి లో అవసరం మేరకు మందులు కొనుగోలు చే యాలని స్పష్టం చేశారు. ఆస్పత్రులకు వస్తున్న రోగులు, గర్భిణుల జాబితాలను పరిశీలించారు. స్వయంగా ఆయన బీపీ, సుగర్ పరీక్షలు చేయించుకుని రికార్డులో నమోదు పద్ధతిని పరిశీలించారు. వైద్యాదికారులు దామోదరరావు, పసుపులేటి సోయల్, ఎన్.శివకుమార్‌లు, వైద్య సిబ్బంది కార్యక్రమంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment