విద్యుత్ ఉద్యోగిపై టీడీపీ నేతల అక్కసు..!
విజయనగరం ఫోర్ట్: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై టీడీపీ నేతలు అక్కసు వెళ్లగక్కారు. కక్షిగట్టి మరి బదిలీ చేయించారు. ఎటువంటి తప్పు చేయకపోయినా అధికార టీడీపీ నాయకులు చెప్పారని విద్యుత్‌శాఖకు చెందిన ఓ అధికారి ఆయనను బదిలీ చేశారు. గంట్యాడ మండలంలోని నీలావతి సచివాలయంలో జేఎల్‌ఎం–2(జూనియర్ లైన్‌మన్)గా గుల్లిపల్లి జోగునాయుడు పనిచేస్తున్నారు. ఆయనను బదిలీ చేయాలని అధికార పార్టీ నాయకులు విద్యుత్‌శాఖ అధికారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జోగునాయుడిని విజయనగరం డి–4 సెక్షన్ పరిధిలోని మలిచర్ల సచివాలయానికి గత నెలలో బదిలీ చేశారు. అయినప్పటకీ టీడీపీ నేతలు సంతృప్తి చెందకుండా దూర ప్రాంతానికి బదిలీ చేయాలని విద్యుత్‌శాఖ అధికారిపై మళ్లీ ఒత్తిడి తెచ్చారు. దీంతో నెల్లిమర్ల మండలంలోని బూరాడ పేట సచివాలయానికి బదిలీ చేసినట్లు తెలిసింది.
పాలిటిక్స్‌లో ప్రమేయం ఉంది
జోగునాయుడు లోకల్‌గా పాలిటిక్స్‌లో ఇన్‌వాల్వ్ అవుతున్నాడనే ఫిర్యాదు రావడంతో బదిలీ చేశాం. విద్యుత్ శాఖ ఎ.డి విచారణ కూడా చేపట్టారు.
– పెద్దింటి త్రినాథరావు, ఈఈ, ఏపీఈపీడీసీఎల్
ఉద్యోగులను రాజకీయాలకు బలిచేయవద్దు
ఉద్యోగులను రాజకీయాలకు బలి చేయవద్దు, ఉద్యోగులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనవద్దు. నిబంధనలకు విరుద్ధంగా జోగునాయుడిని ఈఈ త్రినాథరావు బదిలీ చేయడాన్ని ఖండిస్తున్నాం. జోగునాయుడికి వ్యతిరేకంగా ఏ అధారాలు లేకపోయినా బదిలీచేయడం విచారకరం.
– సురగాల లక్ష్మణ్, ఏపీ విద్యుత్ ఉద్యోగుల
సంఘం(1104) జిల్లా కార్యదర్శి
అకారణంగా బదిలీ
Comments
Please login to add a commentAdd a comment