పశువుల అక్రమ రవాణా అరికట్టాలి
బొబ్బిలి: కనీస సౌకర్యాలు లేకుండా పశువులను రవాణా చేయకూడదని, అలా చేస్తే చట్టరీత్యా నేరమని ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహన రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో డివిజినల్ జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జంతు సంక్షేమం కోసం అనేక చట్టాలున్నాయని, వాటి అమలుకు కిందిస్థాయి అధికారులు కూడా కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో కోడి,పొట్టేళ్ల పందాలు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. దేవాలయాలకు 300 మీటర్ల లోపు ఎటువంటి జంతుబలులు నిర్వహించకూడదని, కుక్కలను చంపకుండా వాటికి సంతాన నియంత్రణ చికిత్సలు నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్‌ల అధ్యక్షతన జంతు సంక్షేమ కమిటీల సమావేశాలను నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లో కై ండ్‌నెస్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్రఅధ్యక్షుడు లోగిశ రామకృష్ణ మాట్లాడుతూ బొబ్బిలి నుంచి బొండపల్లి వరకూ నిత్యం వేలాది పశశువులను హింసాత్మకంగా రవాణా చేస్తున్నారని, రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.
గోప్రేమికుల ఆత్మీయ కలయికను
జయప్రదం చేయాలి
రాష్ట్రంలోని గోరక్షకులతో ఈనెల 14న నిర్వహించే ఆత్మీయ కలయికను జయప్రదం చేయాలని ఏపీ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ రామమోహన రావు చేతుల మీదుగా దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల నల్లమారమ్మ తల్లి గుడి సమీపంలోని తోటలో నిర్వహించే ఈ సమావేశానికి గోప్రేమికులంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ ఎన్నిక, గోసేవకులకు సత్కార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. పశుసంవర్థక శాఖ బొబ్బిలి డీడీ రాజగోపాల్, ఏడీ ఎల్ విష్ణు,డివిజనల్ పంచాయతీ అధికారి ఎ.మోహన రావు, కేవీఆర్ సత్యనారాయణ, రాజకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్డీఓ రామమోహన రావు
Comments
Please login to add a commentAdd a comment