పెస్టిసైడ్–ఫెర్టిలైజర్ అప్లికేటర్ కోర్సులకు ఆన్‌లైన్
పార్వతీపురంటౌన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అగ్రికల్చర్, అల్‌లైడ్ సెక్టార్‌కు సంబంధించి పెస్టిసైడ్–ఫెర్టిలైజర్ అప్లికేటర్ కోర్సులకు ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైత్యన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 13లోపు హెచ్‌టీటీపీఎస్://సార్టుల్/టీజే3యూ2 లింక్ నందు రిజిస్టర్ కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9988853335, 8712655686నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
గురజాడ గృహాన్ని సందర్శించిన నటి సూర్యకాంతం కుటుంబం
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వేంకట అప్పారావు స్వగృహాన్ని అలనాటి సినీనటి సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభమూర్తి, ఈశ్వరీరాణి, బాలసుబ్రహ్మణ్యం, జయలక్ష్మిలు మంగళవారం చైన్నె నుంచి వచ్చి సందర్శించారు. గురజాడ వాడిన వస్తువులను, ఫొటో ఎగ్జిబిషన్ చూసి ఆశ్చర్య చకితులయ్యారు. విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురజాడ మునిమనమడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్, ఇందిర దంపతులకు తెలుగింటి అత్తగారు పుస్తకాన్ని వారు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment