విజయనగరం: జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లలో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి సూచించారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్‌కుమార్ ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని న్యాయమూర్తులందరితో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, డబ్బు లావాదేవీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, విద్యుత్ సంస్థకు చెందిన కేసులు, ఎకై ్సజ్, భూములు, కుటుంబ తగాదాలు, తదితర కేసులు ఇరు పక్షాల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment