ప్రశ్నపత్రాలు తీసుకెళ్లేదెలా?
–10లో
పశువుల అక్రమ రవాణా అరికట్టాలి
కనీస సౌకర్యాలు లేకుండా పశువులను వాహనాల్లో తరలించడం నేరమని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు.
వీరఘట్టం/పాలకొండ రూరల్: పాఠశాలల్లో సెల్ఫ్ ఎస్సెస్‌మెంట్ టెర్మ్–1 మోడల్ (ఎస్‌ఏ–1) పరీక్షలను బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీవరకు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు జిల్లాలోని అన్ని స్కూల్ కాంప్లెక్స్ కేంద్రాల్లోను, మండల విద్యాశాఖ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచారు. ఏ రోజు పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఆ రోజే సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్‌లకు, ఎంఈఓ కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రశ్నపత్రాలన్నీ ఒకే చోట నుంచి పంఫిణీ చేయాలని కోరుతున్నారు.
ప్రశ్నపత్రాల పంపిణీపై గందరగోళం
జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1701 ఉన్నాయి. వీటిలో 1590 ప్రభుత్వ పాఠశాలలు, 111 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ఈ పాఠశాలల్లో 1,16,359 మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. వీరికి ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న ఎస్‌ఏ–1 పరీక్షలకు ప్రశ్నపత్రాల పంపిణీపై గందరగోళం నెలకొంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మినహా గతంలో ఏ పరీక్షలు జరిగినా అన్ని తరగతుల ప్రశ్న పత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయాల నుంచి పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు తీసుకెళ్లేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు. 1–5 తరగతుల ప్రశ్నపత్రాలను సంబంధిత స్కూల్ కాంప్లెక్స్‌కు వెళ్లి తెచ్చుకోవాలి. 6–10వ తరగతి ప్రశ్నపత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లి తెచ్చుకోవాలి. ఈ నిబంధనలు ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రతిబంధకాలుగా మారాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇబ్బందులను మచ్చుకుచూస్తే.. వీరఘట్టం మండలం చిదిమి ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించే ఎస్‌ఏ–1 పరీక్షలకు సంబంధించి 1–5 ప్రశ్నపత్రాలను 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిటివాడ స్కూల్ కాంప్లెక్స్ నుంచి, 6–8వ తరగతి పేపర్లను 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరఘట్టం ఎంఈఓ కార్యాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి. ఓ యూపీ పాఠశాలలో నిర్వహించే పరీక్షకు వేర్వేరు చోట్ల నుంచి పేపర్లను ఉపాధ్యాయులు తీసుకెళ్లాల్సి ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 205 ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఎస్‌ఏ–1 ప్రశ్న పత్రాల కోసం వేర్వేరు చోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధానం మార్చాలని, ప్రశ్నపత్రాలన్నీ ఎంఈఓ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంచేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
నేటి నుంచి ఎస్‌ఏ 1 పరీక్షలు
ఈనెల 18 వరకు జరగనున్న పరీక్షలు
పరీక్షలు రాయనున్న విద్యార్థులు 1,16,359 మంది
1–5 తరగతి ప్రశ్నపత్రాలు స్కూల్ కాంప్లెక్స్ కేంద్రాల్లోను..
6–10వ తరగతి ప్రశ్నపత్రాలు ఎంఈఓ కార్యాలయాల్లో..
ఆవేదనలో ఉపాధ్యాయ సంఘాలు
Comments
Please login to add a commentAdd a comment