రామబాణంకు ప్రత్యేక పూజలు
కొత్తవలస: అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో కొలువైన రాముడికోసం ప్రత్యేకంగా కిలో బంగారం, 13 కిలోల వెండితో రూపొందించిన రామబాణంకు కొత్తవలస దుర్గా దేవి గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామబాణంను అధికమంది భక్తులు దర్శించుకున్నారు. అయోధ్య–భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ చైర్మన్ చల్లా శ్రీనివాస శాస్త్రి తమిళనాడు రాష్ట్రం చైన్నెలో ధనస్సును తయారు చేయించారు. ఈ ధనస్సుకు దేశంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గాదేవి గుడిలో పూజల అనంతరం భక్తుల దరర్శనార్థం ఉంచారు. ఈ ధనస్సును 2025 ఏప్రిల్ 6వ తేదీన అయోధ్యలోని బాలరాముడు ఆలయానికి అప్పగిస్తామని ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసశాస్త్రి తెలిపారు. రాముడు 14 సంవత్సరాల వనవాసానికి గుర్తుగా 14 కిలోలతో ధనుస్సును తయారు చేయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిలో బంగారం, 8 కిలోల వెండితో శ్రీరాముడి పాదుకలను తయారుచేసి ఆలయానికి సమర్పించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment