పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
విజయనగరం క్రైమ్: స్టైఫండరీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు 600 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 321 మంది హాజరైనట్టు ఎస్పీ వకుల్‌జిందల్ తెలిపారు. అభ్యర్థుల హాల్‌టికెట్లు, ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఎత్తు, ఛాతి విస్తీర్ణం కొలతలు చేపట్టారు. ఇందులో అర్హత సాధించిన వారిని పీఈటీకి అనుమతించారు. ముందుగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు పందెంలో నిర్ణీత సమయానికి చేరుకున్నవారికి 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. వీటిలో ఉత్తీర్ణత సాధించినవారికి అర్హత పత్రాలు అందజేశారు. నియామక ప్రక్రి యను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు యూనివర్శ్, ఎం.వీరకుమార్, ఎస్.బాపూజీ, టి.ఎన్.శ్రీనివాసరావు, కె.థామస్‌రెడ్డి, ఏఓ పి.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment