అబలపై అఘాయిత్యాలు
మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ.. అబలలపై దాడులు ఆగడం లేదు.
● 2023లో రేప్ కేసులు 11 కేసులు నమోదు కాగా.. 2024లో 10 కేసులు నమోదయ్యాయి.
● మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలకు సంబంధించి 2023లో 58.. 2024లో 48 కేసులు నమోదయ్యాయి.
● 2023లో పోక్సో కేసులు 18, 2024లో 16 కేసులు నమోదయ్యాయి.
● 2023లో మహిళలకు సంబంధించిన నేరాలు 189.. 2024లో 165 కేసులు నమోదు.
ఎస్పీ ఏమన్నారంటే : మహిళలపై నేరాలను తగ్గించేందుకు పాఠశాలలు, కళాశాలల్లోనూ, గ్రామాల్లోనూ పోక్సో చట్టాల మీద, మహిళల భద్రత చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఉమన్ సేఫ్టీ యాప్ ప్రతిఒక్కరి మొబైల్ ఫోన్లలోనూ ఉండాలని.. ఆపద సమయాలలో ఉపయోగించి పోలీస్ సహకారం పొందాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment