కేజీంపావు బంగారం కొట్టేశారు | - | Sakshi
Sakshi News home page

కేజీంపావు బంగారం కొట్టేశారు

Published Sun, Jan 19 2025 1:11 AM | Last Updated on Sun, Jan 19 2025 1:10 AM

కేజీం

కేజీంపావు బంగారం కొట్టేశారు

అనుమానం రాకుండా..

ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

32 చోరీలకు పాల్పడిన ఇద్దరు

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

104 తులాల బంగారు ఆభరణాలు రికవరీ

జ్యుడీషియల్‌ రిమాండ్‌కు కూడా వెళ్లాడు.

జైలులో కోటేశ్వరరావుతో పరిచయం

రెండో నిందితుడైన గిడిజాల కోటేశ్వరరావు స్వగ్రామం జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం. శ్రీకాకుళంలో ఉండేవాడు. భార్య భరణం కేసులో 2021లో అరెస్టయి శ్రీకాకుళం జైలుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న రాంబాబుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక తనతో పాటు నేరాల్లో పాలుపంచుకోవడానికి ప్రణాళిక వేసుకున్నాడు. రాంబాబు దొంగిలించిన సొత్తును ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌, ముత్తూట్‌ మినీ ఫైనాన్స్‌ కంపెనీల్లో తాకట్టు పెట్టడానికి కోటేశ్వరరావుకు ఇచ్చేవాడు. దానికి కమీషన్‌గా వచ్చే డబ్బుల్లో పదిశాతం వాటా ఇచ్చేవాడు. కొన్ని నేరాల్లో కోటేశ్వరరావు కూడా పాల్గొనేవాడు.

ఏడాది వ్యవధిలో 32 చోరీలు..

ఈ క్రమంలో 2024 నుంచి 2025 వరకు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో 32 చోరీలు చేశారు. ఎచ్చెర్ల పీఎస్‌ పరిధిలో 11 చోరీలు, లావేరు పీఎస్‌ మూడు, శ్రీకాకుళం ఒకటో పట్టణ పీఎస్‌ నాలుగు, శ్రీకాకుళం రూరల్‌ పీఎస్‌ రెండు, గార పీఎస్‌ రెండు, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్‌ నాలుగు, పొందూరు పీఎస్‌ మూడు, పోలాకి పీఎస్‌ ఒకటి, విశాఖజిల్లా పీఎంపాలెం పీఎస్‌ ఒకటి, వీఎస్పీ సిటీ ఒకటి చేశారు. వీరు చేసిన చోరీలన్నీ బంగారు వస్తువులే కావడం గమనార్హం.

ఎచ్చెర్ల చోరీ కేసు తీగ లాగితే..

2024 డిసెంబరులో ఎచ్చెర్లలో ఫంక్షన్‌ కోసం వెళ్తున్న కుమార్తెకు తన తల్లి బీరువాలో భద్రపర్చిన ఐదున్నర తులాల బంగారు కాసుల పేరు, చైన్‌ ఇచ్చింది. తిరిగొచ్చాక మళ్లీ పెట్టేసింది. పండగ సందర్భంగా ఇల్లు శుభ్రం చేద్దామని ఈ నెల 7న బీరువా తెరవగా రెండు నగలూ కనిపించలేదు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ సందీప్‌ దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అనేక విషయాలు బయట పడుతుండటంతో డీఎస్పీ సిహెచ్‌ వివేకానంద పర్యవేక్షణలో జె.ఆర్‌.పురం సీఐ ఎం.అవతారం, ఒకటో పట్టణ సీఐ సీహెచ్‌ పైడపునాయుడులతో కూడిన బృందాలు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. 2022లో అరెస్టయి విశాఖపట్నం సెంట్రల్‌ జైల్‌కు వెళ్లిన రాంబాబు మళ్లీ 2024 జనవరి 10న విడుదలైన మరొకరి సాయంతో ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.

పట్టుబడ్డారిలా..

ఈ నెల 17న సాయంత్రం తమకొచ్చిన సమాచారంతో ఎచ్చె ర్ల, లావేరు ఎస్‌ఐలు సందీప్‌కుమార్‌, చిరంజీవిలు సిబ్బందితో కలిసి అరిణం అక్కివలస కూడలిలోని ప్రకృతి లేఅవుట్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇంటి ఆవరణలోని షూర్యాక్‌, ఎలక్ట్రికల్‌ మీటర్‌ రీడింగ్‌బోర్డు, పూల కుండీలు, కిటికీలోపల తదితర చోట్ల తాళాలు పెట్టే వారి ఇళ్లే వీరి లక్ష్యం. ఇంట్లో వారికి అనుమానం రాకుండా లోపల కూడా నాలుగైదు తులాలకు మించి ఎప్పుడూ దొంగతనాలు చేయలేదు.

ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్తపడేవారు

పోలీసులు వచ్చి చెప్పేవరకు తమ ఇంట్లో దొంగతనం జరిగిందని బాధితులకే తెలియకపోవడం గమనార్హం. ఒకటి రెండు వస్తువులే తీయడంతో కుటుంబంలోని వారు ఇంటిదొంగ పని అని భావించేలా..ఎవరో ఒకరు దొంగతనం చేసినట్లు.. భావించి పలు ఇళ్లల్లో కొట్లాటలు కూడా జరిగినట్లు సమాచారం.

ప్రతిభకు ప్రశంసలు..

భారీ కేసును డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ఛేదించిన సీఐలు ఎం.అవతారం, సీహెచ్‌ పైడపునాయుడు, ఎస్‌ఐలు సందీప్‌కుమార్‌, చిరంజీవి, జి.లక్ష్మణరావు, సిహెచ్‌ మధుసూదనరావు, మిగతా సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు కూడా నిర్లక్ష్యం వహించకుండా తాళాలను తమ వెంటే తీసుకెళ్లాలని, బయట ఉంచకూడదని సూచించారు. బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల్లో మిగిలిన ఎనిమిది తులాల బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నట్లు చెప్పారు.

శ్రీకాకుళం క్రైమ్‌: దొంగలొచ్చారన్న విషయం ఇంటి తలుపులకే తెలియదు.. తాళాలకు సుత్తిదెబ్బలూ ఉండవు.. రాళ్ల దెబ్బలూ పడవు.. కిటికీలు, గ్రిల్స్‌ తొలగించిన దాఖలాలు కనబడవు.. దర్జాగా ఇంటి తాళం ఎక్కడుందో ముందే తెలుసుకుని లోపలికి వెళ్తారు.. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేయకుండా ఎన్ని బంగారు వస్తువులున్నా ఒకట్రెండే తమ లక్ష్యమన్నట్లు.. మూడో కంటికి తెలియకుండా ఏడాది వ్యవధిలో 32 చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. మొత్తం 112 తులాల బంగారాన్ని కాజేశారు. ఈ చోరీల ప్రణాళికలో విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన పున్నాన రాంబాబు (30)ది మాస్టర్‌ మైండ్‌ కాగా, మన జిల్లాలోని జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన గిడిజాల కోటేశ్వరరావు (33) భాగస్వామిగా ఉన్నాడు. జైలు గోడల మధ్య పరిచయమైన వీరి బంధం మళ్లీ అక్కడికే తీసుకెళ్లేలా చేసింది. రూ.84.44 లక్షల విలువైన 104 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

రంజీ జట్టు ఎంపికలో మోసపోవడంతో..

పున్నాన రాంబాబు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విజయవాడలోని తన అత్తగారింటి వద్ద చదువుకున్నాడు. మొబైల్‌ అప్లికేషన్లు, హార్డ్‌వేర్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు. చిన్నప్పటినుంచి క్రికెట్‌పైన మక్కువ ఉండటంతో అక్కడే ఓ కోచ్‌ వద్ద మెలకువలు సాధించాడు. అయితే రంజీ జట్టుకు ఎంపిక విషయంలో కోచ్‌ తనను మోసం చేయడం తట్టుకోలేని రాంబాబు వ్యసనాల బాట పట్డాడు. క్రికెట్‌ బెట్టింగ్‌ కోసం డబ్బులు దుబారాగా ఖర్చుపెట్టడం.. అది కాస్తా ఆస్తి నేరాలు చేసేలా దారి తీసింది. ఈ క్రమంలో ఎస్‌.కోట, విజయనగరం, చీపురుపల్లి, రణస్థలం, లావేరు తదితర పోలీస్‌ స్టేషన్లలో గతంలో నమోదైన 30 కేసుల్లో అరెస్టయి

No comments yet. Be the first to comment!
Add a comment
కేజీంపావు బంగారం కొట్టేశారు1
1/1

కేజీంపావు బంగారం కొట్టేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement