విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ఎంపీ సీ, బైపీసీ రెండో సంవత్సర ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా 93 పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని ఆర్‌ఐఓ మజ్జి ఆది నారాయణ తెలిపారు. పరీక్షలకు హాల్‌టికెట్లను ఇంటర్ విద్యా మండలి ఇప్పటికే విడుదల చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకేషనల్ ప్రాక్టికల్స్ జరుగుతుండగా ఈ పరీక్షలు కూడా ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు 14,470 మంది, బైపీసీ విద్యార్థులు 4,053 మంది పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను వారి కళాశాలల లాగిన్‌లోను, ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment