వేగంగా తూకం వేయాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేసి వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ వకీల్, ఆర్‌ఐలు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా సర్వే
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని డీపీవో వీరబుచ్చయ్య ఆదేశించారు. మండల కేంద్రంలో చేపట్టిన సర్వేను గురువా రం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ కుటుంబాన్ని సర్వే లో చేర్చాలని, విదేశాలు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి జాబితా నమోదు చేయాలని సూచించారు. ప్రజాసమస్యలను పరిష్కరించా లని అన్నారు. ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీవో గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
వర్గీకరణ ఫలాల కోసం..
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎస్సీ వర్గీకరణ ఫలా లు దక్కించుకోవడం లక్ష్యంగా డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించే ధర్మయుద్ధం మ హాబహిరంగ సభను విజయవంతం చేయా లని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్ మాదిగ కోరారు. గురువారం స్థాని క ఆర్ అండ్ బీ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సు ప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఈమేరకు అసెంబ్లీలో తీర్మానిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోవడం లేదన్నారు. నాయకులు సిరిసిల్ల శంకర్, తాండ్ర గట్టయ్య, తాడూరు రమేశ్, తాండ్ర శ్రీకాంత్, మినుముల రాజ్‌కుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులను ఆదుకోవాలి
మంథని: మత్స్యకారులను ప్రభుత్వం అన్ని వి ధాలా ఆదుకోవాలని మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పోతరవేణి క్రాంతికుమార్ కోరారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బోయిన్‌పేట నుంచి అంబేడ్కర్‌చౌక్ వర కు గురువారం ర్యాలీ నిర్వహించారు. విన్యాసా లు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నా రు. సబ్బని సమ్మయ్య, పోలు కనకరాజు, అంకరి కుమార్, గందం వెంకటస్వామి, బయ్య రాజేశ్, కుంట బద్రి, సబ్బని సంతు, బొజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లిరూరల్: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఖాళీగా ఉన్న మూడు పోస్టుల భర్తీకో సం డిసెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని అథారిటీ చైర్మన్ హేమంత్‌కుమార్ తెలిపారు. స్టెనో, టైపిస్ట్, టైపిస్టు కం అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
గ్రూప్–2 అభ్యర్థుల కోసం..
పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన మైనార్టీ గ్రూ ప్–2 అభ్యర్థుల కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీ ర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో షార్ట్, లాంగ్‌టర్మ్ మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తోందని ఇన్‌చార్జి జిల్లా అధికారి రంగారెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు డిసెంబర్ 2, 3, 9, 10వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు.
మొండి బకాయిలు వసూలు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో రెవెన్యూ రికవరీ యాక్ట్ అమ లు చేస్తుండడంతో ఆస్తిపన్ను బకాయిలు వసూలవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఓ బకాయిదారు రూ.24.81 లక్షల ఆస్తిపన్నును ఆయన తరఫున హర్ష, వెంకటేశం, నూరుల్ హుస్సేన్.. కమిషనర్ అరుణశ్రీకి చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment