ఎక్లాస్‌పూర్ 8.6డిగ్రీలు
సాక్షి, ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి : పెద్దపల్లి శివారులో
చలిమంటలు కాగుతున్న స్థానికులు
జ్యోతినగర్(రామగుండం): జిల్లాలో చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో
జిల్లావాసులు చలి ప్రభావంతో వణికిపోతున్నారు. ప్రధానంగా ఐదురోజులుగా చలితీవ్రత పెరుగుతూ వస్తోంది. సోమవారం మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. గరిష్టంగా 31.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
@
కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్‌లో)
Comments
Please login to add a commentAdd a comment